AP Budget 2024 : సీఎం ఏం చెప్పారో తెలుసా: 2024-25 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను అభినందించారు. రూ.2.94 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పయ్యావులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు, ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బడ్జెట్ ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ పయ్యావుల కేశవ్‌కు అభినందనలు తెలిపారు. అలాగే అసెంబ్లీ లాబీల్లో పలువురు ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు పయ్యావులకి అభినందనలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం సంక్షిప్తంగా, అర్థవంతంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.
AP Budget 2024 : సీఎం ఏం చెప్పారో తెలుసా: బడ్జెట్లో రూ.73,720 కోట్లను సంక్షేమానికి కేటాయించిన ప్రభుత్వం, బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లు, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఇరిగేషన్ రంగాలకు హై ప్రయార్టీ ఇచ్చింది. పోలీస్ విభాగానికి రూ.8495 కోట్లు, రోడ్ల మరమ్మత్తులకు ఆర్ అండ్ బికి రూ.9554 కోట్లు కేటాయించింది.
అదనంగా, ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ఆధునిక పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు.