అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ ఇదే 

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)హీరోగా తెరకెక్కిన మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun Son of vyjayanthi).ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయ శాంతి(Vijayashanthi)పవర్ ఫుల్ పోలీస్ క్యారక్టర్ లో కళ్యాణ్ రామ్ కి మదర్ గా చేసింది. ప్రచార చిత్రాలతో మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడగా, ఈ రోజు వరల్డ్ వైడ్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్ లో విడుదలయ్యింది. ట్విట్టర్ లో మూవీ గురించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

ఫస్ట్ హాఫ్ లో కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎంట్రీ సీన్స్ బాగున్నాయని, ఆ ఇద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ చూస్తుంటే నిజంగానే తల్లి, కొడుకులని చూసినట్టుగా ఉందంటు ట్వీట్ లు చేస్తున్నారు. కథ పరంగా కూడా ఆ ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు వర్క్ అవుట్ అయ్యాయని, ముఖ్యంగా  కళ్యాణ్ రామ్ యాక్షన్ అదరగొట్టాడని, అతనొక్కడే తర్వాత ఆ రేంజ్ లో మళ్ళీ తనలోని మాస్ విశ్వరూపాన్ని చూపించాడని అంటున్నారు. విజయశాంతి పెర్ ఫార్మెన్సు కూడా హై లెవల్లో ఉండటంతో పాటు కర్తవ్యంలో విజయశాంతి ని చూసినట్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

టోటల్ గా ఫస్ట్ హాఫ్ మెప్పించిందని, సెకండ్ హాఫ్ కి ప్రేక్షకుడు పూర్తి కథలోకి వెళ్ళిపోతాడని, విలన్ తో వచ్చే యాక్షన్ సీక్వెన్స్  ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అవ్వడంతో పాటు కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయని కూడా అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అదరహో అనే రీతిలో ఉన్నట్టుగా ట్వీట్ లు వస్తున్నాయి. మరి అసలు రివ్యూ వస్తే గాని పూర్తి వివరాలు తెలియవు. ఓవర్ సీస్ రిపోర్ట్ కూడా బాగానే వస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ పై కళ్యాణ్ రామ్, అశోక్ వర్దన్, సునీల్ సంయుక్తంగా నిర్మించగా ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)దర్శకత్వం వహించాడు.

 



Source link