‘పుష్ప’ సిరీస్‌తో సంచలనం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మూడు సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తోంది. అట్లీ, త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్స్‌లో సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఈ మూడు సినిమాల్లో అట్లీతో చేయబోతున్న సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ వీడియో కూడా రిలీజ్ అయింది ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతో అందర్నీ షాక్ చేసారనే చెప్పాలి. ఎందుకంటే బన్నీ, అట్లీ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, విడుదలైన వీడియో చూసిన తర్వాత సినిమా మాత్రం ఊహకందని విధంగా ఉంటుంది అనేది అర్థమవుతోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి 6వ సినిమా.
అల్లు అర్జున్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ 600 కోట్లతో ఈ సినిమా నిర్మాణం జరగనుందదది. అవతార్, ఐరన్‌మ్యాన్, అవెంజర్స్ వంటి ఫేమస్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ బన్నీ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి సూపర్ హీరో క్యారెక్టర్ ఉంటుందట. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ సినిమాకి 21 సంవత్సరాల అభ్యంకర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే సూర్య 45వ సినిమాకి అభ్యంకర్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఇంత చిన్న వయసు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌తో బన్నీ, అట్లీ సినిమాలు చెయ్యలేదు. మొదట ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో వెళుతున్నారు. సింగర్స్‌గా మంచి పేరు సంపాదించుకున్న టిప్పు, హరిణి దంపతుల తనయుడు అభ్యంకర్. ఇప్పటికే కొన్ని సాంగ్స్‌తో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న అభ్యంకర్.. ఇప్పుడు బన్నీ, అట్లీ సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళబోతున్నాడు.