లెజండ్రీ సింగర్ అభిజిత్(Abhijeet Bhattacharya)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rahman)మాట్లాడుతు ‘ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్ కంపోజ్ కోసం గాయని గాయకులు బదులు టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడతాడు. దాని వల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా పోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారిన నేపథ్యంలో అభిజిత్ వ్యాఖ్యలపై ఏ ఆర్ రెహ్మాన్ స్పందించడం జరిగింది.
రెహ్మాన్ మాట్లాడుతు నేను దుబాయ్ వేదికగా ఇటీవల ఒక మహిళా ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసాను. అందులో అరవై మంది దాకా మహిళలు ఉన్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రతినెలా జీతాలు ఇస్తున్నాను. వాళ్ల కోసం ఆరోగ్య భీమా, జీవిత భీమా కూడా కడుతున్నాను. పొన్నియన్ సెల్వం, చావా వంటి చిత్రాలు చేసినప్పుడు 200 మంది సంగీత కారులని ఆయా చిత్రాల్లో భాగం చేశాను. కొన్ని సార్లు కేవలం పాటల కోసమే వంద మంది దాకా వర్క్ చేస్తుంటాను. నేను ఇలాంటివన్నీ ఎక్కడ చెప్పడం కానీ, వాటికి సంబంధించిన ఫోటోలని పంచుకోవడం గాని చెయ్యను. అందుకే నా వర్కింగ్ స్టైల్ పై ఎవరకి అవగాహన ఉండదు. ఇవన్నీ తెలియక చాలా మంది నన్ను తప్పుపెట్టినా పర్లేదు. కావాలంటే అభిజిత్ కి స్వీట్స్ కూడా పంపుతాను. ఎందుకంటే ఒక్కొక్కొరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని చెప్పుకొచ్చాడు.
హిందీ చిత్ర సీమకి చెందిన అభిజిత్ పూర్తి పేరు అభిజిత్ భట్టాచార్య కాగా, హిందీతో పాటు మరాఠీ, తమిళ్, నేపాలి, భోజ్ పురి, పంజాబీ, ఒడియా లాంటి భాషల్లో సుమారు 6000 కి పైగా పాటలు పాడారు. రెహ్మాన్, అభిజిత్ కాంబోలో ‘దిల్ హై దిల్ మెయిన్’ మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘ఏ నజనీన్ సునోనా’ అనేది మొదటి సాంగ్. ఇదే మూవీ తెలుగులో ప్రేమికుల రోజుగా రాగా ‘వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైన అనే లిరిక్ తో వచ్చి నేటికీ మారుమోగిపోతు ఉంది. కాకపోతే తెలుగు వెర్షన్ ఉన్ని మీనన్ పాడటం జరిగింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో ఒక సాంగ్ మాత్రమే వచ్చింది.