ఎన్‌.టి.ఆర్‌. అవార్డు అందుకున్న బాలయ్య గద్దర్‌ గురించి ఏమన్నారో తెలుసా?



మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వారిలో తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ అవార్డులు అందిస్తున్నారు. దళిత కుటుంబంలో పుట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు గద్దరన్న. ఆయన పేరు మీద ఈ అవార్డులు అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చి ఆయన ప్రతిరూపంగా మీ ముందు నిలిపిన కారణజన్ముడు, దైవాంశసంభూతుడు, నా గురువు దైవం అయిన నాన్నగారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 1996లో ఎన్‌.టి.ఆర్‌. అవార్డును ప్రభుత్వం ప్రారంభించింది. 

ఎంతో మంది నటులు ఆ అవార్డును అందుకున్నారు. అయితే 10 సంవత్సరాలుగా అవార్డు కార్యక్రమం లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైన ఈ అవార్డును తొలిసారి నేను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డుతోపాటు నగదు బహుమతి కూడా అందించారు. ఆ డబ్బు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌కి ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. మా హాస్పిటల్‌ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా కూడా వైద్యం అందిస్తున్నాం. దానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతని అందింనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. 



Source link