‘ఓదెల 2’ ట్రైలర్.. ఇక శవ నామస్మరణే..!

 

స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీంవర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత ‘ఓదెల 2’ భారీ బిజినెస్ చేసిందని సమాచారం. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. (Odela 2 Trailer )

 

‘ఓదెల 2’ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. “భరతఖండాన, దక్షిణగంగా తీరాన, పరమాత్ముడి పుట్టిల్లయిన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పూసుకుంటోంది.” అనే వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమైంది. దైవానికి, దెయ్యానికి మధ్య యుద్ధంగా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా శివశక్తి పాత్రలో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. డివోషనల్ టచ్, హారర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ తరహా సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. అదే బాటలో ‘ఓదెల 2’ కూడా పయనిస్తుందేమో చూడాలి. ట్రైలర్ లో “ఇక నువ్వు, నీ జనం శివ నామస్మరణ కాదు.. శవ నామస్మరణే” వంటి డైలాగ్ లతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

 




Source link