క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం | aqua farmers declare crop holiday| meeting| bhimavaram| trump| taxes

posted on Apr 9, 2025 3:16PM

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 1 తరువాతే సీడ్ స్టాకింగ్ ఆరంభించనున్నట్లు ప్రకటించాయి. రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై భీమవరంలో మంగళవారం (ఏప్రిల్ 8)న జరిగిన అక్వారైతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచీ ఆక్వారైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రొయ్యల మేత నుంచి మద్దతు ధర వరకూ అన్ని విధాలుగా తమకు అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో రొయ్యల సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వచ్చిన రైతులు స్పష్టం చేశారు.   



Source link