ఖరారు కాని నాన్‌ లోకల్‌ కోటా, తెలంగాణ ఈఏపీ దరఖాస్తుల స్వీకరణలో జాప్యం-delay in receiving applications for tg eapcet due to non local quota ,తెలంగాణ న్యూస్


ఈ నెల 25న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని వివిధ శాఖలు, వర్సిటీ అధికారులతో కూడిన సెట్ కమిటీ షెడ్యూల్ నిర్ణయించింది. దీనిప్రకారం ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు నెలలుగా స్థానికత, 15 శాతం కోటా తదితర అంశాలపై ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చిస్తూనే ఉంది. దీనిపై నాన్‌ లోకల్ కోటా రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వాయిదా వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.