ప్రముఖ నటి అభినయ (Abhinaya) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు వేగేశ్న కార్తీక్ ను ఆమె వివాహం చేసుకున్నారు. భీమవరంకు చెందిన కార్తీక్ వ్యాపారవేత్త. అభినయ, కార్తీక్ ల వివాహం హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
మాట్లాడలేనప్పటికీ నటిగా అభినయ తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి.
తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్ తో అభినయ దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం మార్చిలో జరిగింది. తాజాగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జంట చూడముచ్చటగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.