చంద్రబాబునాయుడుతో సినీ ప్రముఖుల భేటీ..ఆ హీరో వస్తున్నాడా!



తెలుగు సినిమా రంగానికి తగినంత చేయూత, ప్రోత్సాహాన్ని అందించడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ముందు ఉంటాయి. అందుకే భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ఆయా చిత్రాల ప్రతినిధులు టికెట్ రేట్స్ పెంచుకుంటామని  అడగ్గానే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దీన్ని బట్టి సినిమా రంగానికి ప్రభుత్వ సహకారం ఎంతగా అవసరమో అర్ధం చేసుకోవచ్చు.

ఈ నెల 15 న తెలుగు చిత్ర సీమకి చెందిన పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవనున్నారు. ఉండవల్లి లోని సిఎం నివాసంలో జరిగే  ఈ భేటీపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికార ప్రకటన వచ్చింది. ఈ భేటీలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి సాధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంతో పాటు, సినిమా రంగానికి చెందిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు. సినీ రంగానికి చెందిన వాళ్లంతా కలిసి రావాలని చంద్ర బాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటన చేసారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్  కూడా కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు  సినీ రంగానికి చెందిన సమస్యలపై ముఖ్య మంత్రి గారిని సినీ ప్రముఖులు కలవాలని చెప్పిన విషయం తెలిసిందే. 

సింగల్ థియేటర్స్ మూత వేత అంశంపై ఇప్పటికి చర్చ నడుస్తూనే ఉంది. ఈ అంశం తెరపై వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్ కందుల దుర్గేష్ మాట్లాడుతు అన్ని థియేటర్స్ లో ప్రేక్షకులకి కావాల్సిన వసతులు లభిస్తున్నాయా! ఫుడ్ అండ్ మిగతా ఐటమ్స్ ధరలు ఎలా ఉన్నాయనే దానిపై ఒక  కమిషన్ వేశారు. దీంతో ముఖ్య మంత్రితో జరగబోయే భేటీలో ఏ ఏ అంశాలు తెరపైకి వస్తాయో అనే ఆసక్తి అందరిలో ఉంది. మరి ఈ భేటీకి పవన్ కళ్యాణ్ హాజరవుతాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

 


 

 



Source link