తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవాలని గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జూన్ 15న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ఉండవల్లిలోని సిఎం నివాసంలో జరిగే ఈ భేటీపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికార ప్రకటన వచ్చింది. ఈ భేటీలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి సాధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంతో పాటు, సినిమా రంగానికి చెందిన వివిధ సమస్యలపై చర్చించాలనుకున్నారు. అయితే తాజా సమాచారం మేరకు జూన్ 15న జరగాల్సిన భేటీని వాయిదా వేశారు. అయితే తరువాత సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.
సింగల్ థియేటర్స్ మూత వేత అంశంపై ఇప్పటికి చర్చ నడుస్తూనే ఉంది. ఈ అంశం తెరపై వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్ కందుల దుర్గేష్ మాట్లాడుతు అన్ని థియేటర్స్ లో ప్రేక్షకులకి కావాల్సిన వసతులు లభిస్తున్నాయా! ఫుడ్ అండ్ మిగతా ఐటమ్స్ ధరలు ఎలా ఉన్నాయనే దానిపై ఒక కమిషన్ వేశారు. దీంతో ముఖ్య మంత్రితో జరగబోయే భేటీలో ఏ ఏ అంశాలు తెరపైకి వస్తాయో అనే అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు అర్థంతరంగా ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. మరి దీనిపై ఎలాంటి అప్‌డేట్ వస్తుందో చూడాలి.