జంటపేలుళ్ల నిందితులకు ఉరి.. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి | union minister kisham reddy welcomes hicourt verdict| dilsukhnagar| twin| blasts| culprits

posted on Apr 8, 2025 4:10PM

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు. ప్రజాస్వమ్యంలో హింసకు, ఉగ్రవాదానికి చోటు లేదని హైకోర్టు తీర్పుద్వారా మరో సారి స్పష్టమైందని కిషన్ రెడ్డి అన్నారు.

 పుష్కర కాలంగా దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్లు ఆ పెలుళ్ల బాధితులను ఓ పీడకలగా వెంటాడుతున్నాయన్న ఆయన.. ఎట్టకేలకు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు జీరో లోలరెన్స విధానంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.  జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించింది.ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందిని కిషన్ రెడ్డి అభినందించారు. 



Source link