టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్-today andhra pradesh news latest updates february 25 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


TDP Office Attack Case :టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 25 Feb 202503:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Office Attack Case :టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

  • TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని వైసీపీ నేత‌ల‌కు ఆదేశించింది.  

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202502:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CM Chandrababu : మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు- సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఏడాది రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ.25 లక్షల ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202501:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Entrepreneur Training : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల‌కు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 28 నుంచి ప్రకాశం జిల్లాలో ఉచిత శిక్షణ

  • Entrepreneur Training : నిరుద్యోగ యువ‌తీ, యువ‌కుల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ క‌మ్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం కింద ఫిబ్రవ‌రి 28వ తేదీ నుంచి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వివ‌రించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202512:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Crime : ప‌ల్నాడు జిల్లాలో ఘోరం.. బాలిక‌ను ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని చేసిన వివాహితుడు!

  • Palnadu Crime : ప‌ల్నాడు జిల్లాలో ఘోర‌ం జరిగింది. బాలిక‌ను మాయ‌మాట‌ల‌తో లోబ‌ర్చుకుని.. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని చేశాడు ఓ వివాహితుడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ద‌త్తత పేరుతో అమ్మేశాడు. అమ్మాయిలు కావాలంటే, ఈ నెంబ‌ర్‌ను సంప్ర‌దించండ‌ని రైళ్ల బోగీల‌పై ఆమె ఫోన్ నెంబ‌ర్‌ను రాశాడు. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202512:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : నన్ను ఒక మాట అన్నా సరే, 15 ఏళ్లు కలిసే ఉంటాం- వైసీపీని అధికారంలోకి రానివ్వం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలున్నా…15 ఏళ్లు కలిసే ఉంటామని, వైసీపీ అధికారం దక్కనీయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుకు గవర్నర్ కు తాము క్షమాపణలు చెబుతున్నామన్నారు. వైసీపీ నేతల విధ్వంసం వివేకా హత్యను గుర్తుచేసిందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202511:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Thalliki Vandanam Scheme : ఏప్రిల్/మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు- మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

  • Thalliki Vandanam Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై మంత్రి లోకేశ్ ప్రకటన చేశారు. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ రెండు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202510:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Wife Victims : 35 మందితో ప్రారంభ‌మై 10 వేలకు విస్త‌ర‌ణ‌.. భార్యాబాధితుల సంఘం 13 డిమాండ్లు ఇవే!

  • AP Wife Victims : స‌మాజంలో ఇటీవ‌ల భార్యాబాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. భార్య‌ల‌కు ఏ స‌మ‌స్య‌ల వ‌చ్చినా.. వారి త‌ర‌పున నిల‌బ‌డేందుకు మ‌హిళా సంఘాలు ఉన్నాయి. భ‌ర్త‌ల‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు ఏ సంఘం ముందుకు రాదు. ఈ నేప‌థ్యంలోనే భార్యాబాధితుల సంఘం ఏర్ప‌డింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202509:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Minister Lokesh : మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారు, ఏమైంది? – శాసనమండలిలో మంత్రి లోకేశ్ ఫైర్

  • Minister Lokesh : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రి లోకేశ్ కు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఇంగ్లీషు భాష, వీసీలు, ఎన్డీయేకు మద్దతు, ప్రత్యేక హోదాపై మంత్రి లోకేశ్ సమాధానాలు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202508:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mirchi Rates : ఏపీ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, 25 శాతం పంటకు ఎంఐపీ వర్తింపు- రాష్ట్రానికి లేఖ

  • Mirchi Rates : ఏపీలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పండిన మిర్చి పంటలో 25 శాతానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ 25 శాతం మిర్చి క్వింటా ధర రూ.11,781గా నిర్ణయించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202507:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: GV Reddy Issue: టీడీపీలో జీవీ రెడ్డి కల్లోలం… సోషల్‌ మీడియాలో ధిక్కార స్వరాలు… బాబు తీరుపై తెలుగు తమ్ముళ్ల విమర్శలు

  • GV Reddy Issue: తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డి చిచ్చు రేపి వెళ్లిపోయాడు. ఫైబర్‌ నెట్‌ వ్యవహారంపై  జీవీ రెడ్డి ప్రెస్‌మీట్‌, ఐఏఎస్‌ అధికారుల ఆగ్రహం, చంద్రబాబు మందలింపు.. చివరకు జీవీ రెడ్డి నిష్క్రమణతో ఆ పార్టీలో దుమారం రేగింది. బాబు తీరును టీడీపీ శ్రేణులు బహిరంగంగా ధిక్కరిస్తున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202506:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Gannavaram : వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్ భార్య!

  • Gannavaram : వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ కేసులో న్యాయస్థానం రిమాండ్‌ విధించగా.. జైలులో ఉన్నారు. తాజాగా వంశీపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు లాయర్ భార్య ఫిర్యాదుతో.. వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202505:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Where Is Kumkis: కుంకీ ఏనుగులు ఎక్కడ? కర్ణాటకతో ఒప్పందానికి ఐదు నెలలు…ఏపీలో ఆగని ఏనుగుల దాడులు..

  • Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో ఏనుగుల దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆహారం వెదక్కుంటూ జనావాసాల్లో వస్తున్న ఏనుగులు తరచూ సీమ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఐదు నెలలు దాటింది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202504:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Pension Verification : పెన్ష‌న్ల‌ వెరిఫికేష‌న్‌కు మార్చి 15 డెడ్‌లైన్‌.. ఆ త‌రువాతే అర్హుల జాబితా ప్ర‌క‌ట‌న‌!

  • AP Pension Verification : ప్ర‌భుత్వం పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌ను వేగ‌వంతం చేసింది. వెరిఫికేష‌న్ పూర్తికి డెడ్‌లైన్ కూడా ప్ర‌క‌టించింది. మార్చి 15వ తేదీన పెన్ష‌న్ల వెరిఫికేష‌న్‌కు తుది గ‌డువు నిర్ణ‌యించింది. ఆ త‌రువాత పెన్ష‌న్ల‌ అర్హుల జాబితాను ప్ర‌క‌టించ‌నుంది. అన‌ర్హుల‌కు పెన్ష‌న్ తొల‌గించ‌నుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202502:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం, ఐదుగురు భక్తుల మృతి, గుండాలకోనలో విషాదం…

  • Elephants Attack: అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది. గుండాలకోనలో అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళుతున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి అటవీ అధికారులు వెళ్లారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 25 Feb 202501:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ap Sachivalyam: ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…

  • AP Sachivalayam: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది హేతుబద్దీకరణ ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో పని చేయాల్సిన సిబ్బందిని ఖరారు చేయడంతో  మిగులు సిబ్బంది లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా  15వేలకు పైగా సిబ్బంది మిగలనున్నారు. వారిని  ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. 

పూర్తి స్టోరీ చదవండి