తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా? | Zaheer Khan| Former Team India pacer| born child| Sagarika| Fatehsinh Khan|Social media| IPL|  Lucknow Super Giants| BCCI

posted on Apr 16, 2025 3:16PM

 

భారత మాజీ క్రికెటర్ జ‌హీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య  సాగ‌రిక పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. 

టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సాగరిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. “ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము” అని ఆమె రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచ‌డం చూడొచ్చు. తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌హీర్ ఖాన్ దంప‌తుల‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

 కాగా, 2016లో తోటి క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్క‌ట‌య్యారు. కొడుకును కూడా నీలాగే చాంపియన్‌ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్.. యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.



Source link