తల్లికి వందనం సక్సెస్‌తో.. జగన్‌కు కడుపుమంట పెరిగింది : లోకేశ్ | Minister Lokesh| Talliki Vandanam| YS Jagan| CM Chandrababu| Naralokesh| TDP

posted on Jun 15, 2025 6:40PM



 

తల్లికి వందనంలో ఒకే ఆధార్‌పై వందల మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని తల్లుల కళ్లలో ఆనందం చూసి వైఎస్ జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మరోసారి మాజీ సీఎం జగన్ విష ప్రచారానికి తెరలేపారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని నారా లోకేష్ వెల్లడించారు.  

గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ అని పేర్కొన్నారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వం. జగన్  కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్దని లోకేశ్ అని లోకేష్ సెటైర్లు వేశారు

 



Source link