posted on Apr 9, 2025 4:43PM
వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది. గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. గత నెల 28న 7.7 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అప్పటి భూకంపంలో 3600 మందికి పైగా మరణించారు. మరో 5 వేల 17 మంది గాయపడినట్లు తైవాన్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ మరో 160 మంది జాడ తెలియల్సి ఉందని పేర్కొంది.
ఆ భూకంపానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయాందోళనలకు గురౌతున్నారు. బుధవారం (ఏప్రిల్ 9)న కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య తీరంలోని యిలాన్‌కు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరంలో భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. కు సిబ్బంది సహకారం అందించారన్నారు.