హీరోగానే కాకుండా నటుడుగాను ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ ని పోషించి,తన కంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు రానా.(Rana) బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 , రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ తో అయితే ఇండియా వైడ్ గా పేరు సంపాదించాడు. మరో పక్క షోస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా రానా డబ్ల్యు డబ్ల్యుఈ (వరల్డ్ రెజిలింగ్ ఎంటర్ టైన్ మెంట్) ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ లో నిర్వహించే ‘రెజిల్ మేనియా’ వేడుకకు హాజరయ్యాడు.
41 వ రెజిల్ మేనియా(wrestlemania)ఈ నెల 19 ,20 వ తేదీల్లో లాస్ వేగాస్ లో జరగగా, ఈ ఈవెంట్ కి ఆహ్వానం అందుకొని సందడి చేసిన తొలి బారతీయ నటుడుగా రానా నిలిచాడు. ఈ విషయంపై రానా స్పందిస్తు ఈవెంట్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక ఆ వేడుకని తొలిసారిగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంతో పాటుగా 1993 తర్వాత లాస్ వేగాస్ వేదికగా ఆ ఈవెంట్ జరిగింది.