పవన్ కళ్యాణ్ సర్ నా ప్రార్థనలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి

వకీల్ సాబ్ మూవీలో అనన్య నాగళ్ళ చేసిన రోల్ చిన్నదే ఐనా మంచి ఎఫెక్టీవ్ గా పని చేసింది. ఆ మూవీతో ఆమె దశ తిరిగింది. ఆ మూవీ తర్వాత ఆమె కొన్ని మూవీస్ లో కూడా నటించింది. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. “ఈ రోజుకి వకీల్ సాబ్ మూవీ వచ్చి నాలుగేళ్లు అయ్యింది. ఈ మూవీ నా జీవితాన్ని మార్చేసింది. అలాంటి ఈ శుభ సందర్భంలో ఒక బాధ కలిగించే అంశం కూడా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డాడు అని తెలిసింది. ఆ బాబు త్వరగా రికవరీ అయ్యి ఆరోగ్యంగా, బలంగా తయారవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ సర్ నా ప్రార్థనలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి” అంటూ ఆ పోస్ట్ లో పెట్టింది.

 

అనన్య నాగళ్ళ మిగతా హీరోయిన్స్ కంటే కొంచెం డిఫరెంట్ కంటెంట్ ని ఎంచుకుంటూ మూవీస్ చేస్తూ వెళ్తోంది. అది హిట్టా ఫట్టా అన్నది కాకుండా జనాలు ఏది కోరుకుంటున్నారో అదే మూవీస్ చేస్తోంది. “మల్లేశం” మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఈమె తర్వాత పవన్ కళ్యాణ్ మూవీలో నటించింది. ఆ తర్వాత ప్లే బ్యాక్, తంత్ర, పొట్టెల్, బహిష్కరణ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి మూవీస్ లో నటించింది. ఆ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ లో చేసి తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఐతే ఇప్పుడు అనన్య ఒక హిందీ ప్రాజెక్ట్ చేయబోతోంది.  రీసెంట్ గా ఒక షాప్ లో గోలీ సోడాలు కొట్టి అమ్మేసింది. ఏదైనా సరే చిన్నపిల్లలా అల్లరి చేస్తూ ఉంటుంది అనన్య. అలాగే ఒకబాబుకు కూడా కావాల్సిన పుస్తకాలు కొనిచ్చింది. ఆ వీడియోని కూడా షేర్ చేసింది.




Source link