పీడీఎస్ ప్రక్షాళనే లక్ష్యం.. నాదెండ్ల మనోహర్ | Cleansing the public distribution system aim| minister| nadendla| manohar| ration| card| holder

posted on Jun 10, 2025 10:10AM



జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమిస్తున్నారు.  రేషన్ సరుకుల పంపిణీ ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో బాగంగా సోమవారం (జూన్ 9) ఏలూరులో  పర్యటించారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతా రేషన్ సరుకుల పంపిణీ ఆగడానికి వీల్లేదని ఆయనీ సందర్భంగా డీలర్లకు చెప్పారు. సర్వర్లు పని చేయడం లేదనో, మరో కారణం చేతనో రేషన్  షాపులకు వస్తున్న వారిని డీలర్లు వెనక్కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన.. సర్వర్ పని చేయని సందర్భంలో లబ్ధిదారుని ఫొటో తీసుకుని సంతకం చేయించుకుని రేషన్ ఇవ్వాలనీ, అంతే తప్ప పంపిణీని వాయిదా వేయడానికి వీల్లేదని కచ్చతమైన ఆదేశాలు జారీ చేశారు.  

జగన్ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ అంటూ దొడ్డిదారిన రేషన్ సరుకులను అక్రమ మార్గాల ద్వారా అమ్ముకున్నారని, దానిని నిర్మూలించేందుకే పాత పద్దతికే తాము మద్దతుగా నిలిచామని నాదెండ్ల చెప్పుకొచ్చారు.  లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ వారికి అంది తీరాలపీ, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు.



Source link