ప్రముఖ నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ బాధాకర సంఘటన గురించి సప్తగిరి సోషల్ మీడియాలో ”Miss You Amma” అని పోస్ట్ చేశారు. అలాగే ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సప్తగిరి.. ఆ తర్వాత కమెడియన్ తనదైన ముద్ర వేశారు. హీరోగానూ రాణిస్తున్నారు. ఇటీవల ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.