మాస్ జాతర.. బాలీవుడ్ లో మారుమోగిపోతున్న మలినేని పేరు!

 

ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక తెలుగు దర్శకుడి పేరు మారుమోగిపోతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. గోపీచంద్ మలినేని. 2010లో రవితేజ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘డాన్ శీను’తో దర్శకుడిగా పరిచయమైన మలినేని.. మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకొని, మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మలినేని ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘బలుపు’, ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘జాట్’తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

 

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మొదటి హిందీ చిత్రం ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఫిల్మ్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం, థియేటర్ల దగ్గర మాస్ జాతరను తలపిస్తోంది. ఇది కదా అసలైన సెలబ్రేషన్, ఇది కదా అసలుసిసలైన మాస్ ఫిల్మ్ అంటూ.. హిందీ ఆడియన్స్, క్రిటిక్స్ అనే తేడా లేకుండా అందరూ దర్శకుడు మలినేనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

యాక్షన్ సూపర్ స్టార్ గా పేరున్న సన్నీ డియోల్ ని ఈ 15-20 ఏళ్ళలో సరిగ్గా చూపించిన ఏకైన డైరెక్టర్ గోపీచంద్ మలినేని అని అక్కడివారు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలు ఈ మధ్య హిందీలో రావడంలేదని.. బాలీవుడ్ ఏం మిస్ అవుతుందో ఈ డైరెక్టర్ ని చూసి నేర్చుకోవాలని ఫేమస్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్, డైరెక్టర్ మలినేనితో సినిమా చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ చూస్తామని నార్త్ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక్క సినిమాతోనే హిందీ గడ్డపై మలినేని పేరు మారుమోగిపోతోంది. చాలా కాలం తర్వాత హిందీ ఆడియన్స్ కి అసలైన మాస్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ మలినేనే అనే మాట బలంగా వినిపిస్తోంది.

 



Source link