పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్న కుమారుడు’మార్క్ శంకర్ పవనోవిచ్’ రీసెంట్ గా సింగపూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురి కావడంతో గాయాల బారిన పడ్డాడు.దీంతో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శంకర్ కోలుకోవాలని తమ బ్లెస్సింగ్స్ తెలియచేస్తున్నారు.మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను.మీ చిన్న యోధుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మీరు మీ కుటుంబసభ్యులు దైర్యంగా ఉండాలంటు ట్వీట్ చేసాడు.
రీసెంట్ గా ఎన్టీఆర్ ట్వీట్ కి పవన్ రిప్లై ఇస్తు ప్రియమైన ఎన్టీఆర్ గారు మీ మాటలకు ధన్యవాదాలు.ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతును అభినందిస్తు ధన్యవాదాలు తెలుపుతున్నాను.లిటిల్ వన్ కొలుకుంటున్నాడంటూ ట్వీట్ చేసాడు.