posted on Apr 9, 2025 5:42PM
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ సిఐడి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది. బుధవారం నాడు ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పలుమార్లు రిమాండ్ ను పొడిగించిన న్యాయస్థానం మరో మారు పొడిగించడంతో వంశీ షాక్ లో ఉన్నారు. ఆయన పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తుచేస్తున్నప్పటికీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం లేదు. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో కూడా వంశీ నిందితుడు.