విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది..ఎవరినీ వదలం : రామ్మోహన్ నాయుడు | Ahmedabad| plane crash| Air India plane| Shahi Bagh Hotel| Amit Shah| Minister Rammohan Naidu| London flight| Meghani Nagar| Ghodaasar camp| Ahmedabad airport| PM MODI| Amit Shah

posted on Jun 12, 2025 7:54PM



 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంఘటనా స్థలాన్ని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానం కూప్పకూలిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు  ప్రమాద ఘటన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరానన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.

అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని.. విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో విజయ్‌ రూపానీ ఉన్నారన్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో  డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించి అన్ని కారణాలపై ఆరా తీస్తున్నది. దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలున్నాయి

 



Source link