హనుమన్ జయంతి రోజున ఫ్యాన్స్ కి అరుదైన కానుక ఇచ్చిన చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర(Vishwambhara).సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు కాగా,యువి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి,ప్రమోద్  చిరు కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 

రీసెంట్ గా ఈ మూవీ నుంచి హనుమాన్(Hanuman)జయంతి సందర్భంగా ఆస్కార్ విన్నర్ కీరవాణి(Keeravani)సంగీత సారథ్యంలో రూపొందిన ‘రామరామ'(Rama Raama)సాంగ్ రిలీజ్ అయ్యింది.చిరంజీవిపై పిక్చరైజేషన్ చేసిన ఈ సాంగ్  రాముడి గొప్పతనాన్ని హీరో చెప్తుండటంతో పాటుగా,తమతో పాటు హనుమంతుడిని కూడా గొంతు కలపమని కోరుతున్నాడు.రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సాంగ్ ట్యూన్ కి తగ్గట్టు   అద్భుతంగా ఉంది.రాముడు,హనుమంతుడి భక్తులలో పూర్తి భక్తి భావాన్ని నింపడంతో పాటు ఈ సాంగ్ ఒక కానుక అని చెప్పుకోవచ్చు.లెజండ్రీ సింగర్ శంకర్ మహదేవన్(Shankar Mahadevan)తో కలిసి లిప్సిక ఆలపించడం జరిగింది.

 

 



Source link