హీరో కొత్త ఇ-రిక్షా రాహీ | hero company| e-rickshaw raahii| hero company e rickshaw

posted on Apr 3, 2015 5:35PM

 

ద్విచక్ర వాహనాలు తయారుచేసే హీరో ఎలక్ట్రిక్ సంస్థ విద్యుత్ తో నడిచే ఇ-రిక్షా రాహీని గురువారం ఆవిష్కరించింది. దీని ఖరీదు రూ 1. 10 లక్షలు. ఈ వాహనానికి 1000 వాట్ల సామర్ధ్యం కలిగిన మోటార్ ఉందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీలు ప్రయాణించవచ్చని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ తెలిపారు. దీని లోపల ఎల్ఈడీ దీపాలు, యూఎస్బీ మొబైల్ ఛార్జర్, కర్టెన్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంస్థలో ఉన్న 120 మంది డీలర్ల వద్ద ఈ వాహనాలు లభిస్తున్నాయని, తాము ఇప్పటికే లక్షకు పైగా ద్విచక్ర వాహనాలు విక్రయించామని సోహిందర్ తెలిపారు. ఇ- రిక్షాకు పశ్చిమ బంగా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అన్నారు.



Source link