హెలికాప్టర్ లో వచ్చి.. కారులో తిరిగి వెళ్లిన జగన్.. ఎందుకో తెలుసా? | jagan helocopter damaged| pilot| bag| stolen| ycp| cadre| over

posted on Apr 8, 2025 3:54PM

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.  హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో హెలిపాడ్ మీదకు చొచ్చుకుపోగా, ల్యాండింగ్ సమస్య తలెత్తింది. రెండో ప్రయత్నంలో హెలికాప్టర్ ల్యాండ్ కాగా, చుట్టుముట్టిన కార్యకర్తలు బలవంతంగా డోర్ లాగారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు కానీ పైలట్ డోర్ లాగడంతో కిందపడ్డ పైలెట్ బ్యాగ్ ను ఎవరో ఎత్తుకు పోయారంటున్నారు. జగన్ దిగిన వెంటనే హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్ బదులు కారులోనే జనగ్ బెంగళూరుకు వెళ్లిపోయారని చెబుతున్నారు.

హెలికాప్టర్ డోరుకు ఎయిర్ బ్రేక్ వచ్చిందని వైపీపీకి చెందిన వారు ఓ ఫొటో ప్రచారంలో పెట్టారు. జగన్ యథావిధిగా బాధితుల పరామర్శ కన్నా, పబ్లిక్ల లో ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించి, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. దీంతో గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వచ్చినప్పుడు మిర్చి ఎత్తుకు పోయిన సంఘటనను జనం గుర్తు చేసుకుని వీళ్లు మారరని నిట్టూర్పు విడుస్తున్నారు. 

 



Source link