‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘వార్-2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి ఎన్టీఆర్ పై పడింది. ఆయన లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి అక్కడ ఓ రేంజ్ లో వార్తలు ప్రచురితమవుతున్నాయి.
టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఆయనకు ఉన్నాయి. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్.. ఖరీదైన ప్రైవేట్ జెట్ ని కూడా కలిగి ఉన్నాడని హిందీ మీడియా చెబుతోంది.
బాలీవుడ్ మీడియా ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ.500 కోట్లు. ఆస్తుల వివరాలకొస్తే.. రూ.25 కోట్ల విలువైన ఇల్లు, విలాసవంతమైన ఫామ్‌హౌస్, రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, కోట్ల విలువ చేసే ఐదు కార్లు, మూడు వాచ్ లు ఉన్నాయని అక్కడి మీడియా రాసుకొచ్చింది.
ఎన్టీఆర్ ఇల్లు, కార్లు, వాచ్ లు గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆయనకు 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉందనే విషయం పెద్దగా వినలేదు. దీంతో ఎన్టీఆర్ కి అంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉంటే, హిందీ మీడియా చెబుతున్నట్టు.. ఎన్టీఆర్ నెట్ వర్త్ 500 కోట్లే ఉండకపోవచ్చని, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.