posted on May 12, 2025 2:13PM
పాకిస్థాన్ కి చైనా నిశ్శబ్ధ సాయం ఎలా చేసింది?
మన రాఫెల్ చైనా సాయంతో పాక్ కూల్చేసిందా?
అసలు ఈ యుద్ధంలో చైనా దాని ఆయుధ పాత్ర ఏంటి?
రాఫెల్ పై వస్తున్న ఆరోపణలు నిజమేనా?
టెలిగ్రాఫ్ కథన సారాంశమేంటి?
ఈ వ్యాసంపై వస్తున్న అభ్యంతరాలు ఎలాంటివి?
పాకిస్థాన్ భారత యుద్ధ విమానాలు కూల్చడంలో చైనా పాత్ర ఎలాంటిదన్నదొక చర్చ. అయితే చైనా చాప కింద నీరులా పాకిస్థాన్ కి అందించాల్సిన సాయమంతా అందిస్తోన్నట్టు పెద్ద పెద్ద అంతర్జాతీయ పత్రికలు, వాటిలోని రాతగాళ్ళ కథనాల ద్వారా తెలుస్తోంది. మనమెంతో ప్రతిష్టాత్మకంగా భావించే రాఫెల్ యుద్ధ విమానాలను చైనా సాయంతో పాక్ పేల్చేసిన ఘటన తాలూకూ కథనాలు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ వర్గాల వారిని అట్టుడికిస్తోంది. టెలిగ్రాఫ్ లో వచ్చిన ఓ కథనం మేరకు.. ఆ రోజు ఉదయం 4 గంటలకు ఒక అసాధారణ ఘటన నమోదయ్యింది. అది యుద్ధ భూమిలో కాదు.. దౌత్య పరమైన విషయంలో. పాక్ లోని చైనా రాయబారి రావల్పిండికి అత్యవసరంగా ఫోన్ చేశారు. తర్వాత కొన్ని గంటల్లోనే భరత వైమానిక బలాన్నది బద్ధలు కొట్టేసింది.
భారత వైమానిక దళం రోజుల తరబడి సమావేశమవుతోంది. దాదాపు 180 విమానాలు పశ్చిమ సరిహద్దులో కేంద్రీకృతమై ఉన్నాయి. లక్ష్యం ఎంతో స్పష్టంగా ఉంది. బాలాకోట్ ను పునరావృతం చేయడమే టార్గెట్. పాకిస్థాన్ రక్షణ గోడలను విచ్చిన్నం చేయడం.. వ్యూహాత్మాక ఆధిపత్యాన్ని పునరుద్దరించడం.
కానీ యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యుద్ధ విమానాలు ఎగిరే ఆకాశాలు కూడా ఎప్పుడూ నీలిరంగులోనే ఉండవు. అప్పుడప్పుడూ తన రూపును షేపును.. మార్చుకుంటూ ఉంటుందా వార్ స్కై. భారత వైమానిక దళం ఎప్పుడూ ప్రవేశ ద్వారాలు దాట లేదు. దాని అవతల ఏముందో వారికి ఎంతో స్పష్టంగా తెలుసు.
చైనా J-10C ఫైటర్లు, అధునాతన PL-15 క్షిపణులు, 300 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగిన మాక్ 5 హంటర్స్, షూటర్ ఎవరైనా తమ పరిధిలోకి తేగలిగే.. ఏరియల్ రాడార్లు.. బేసిగ్గా భారత్ కేవలం పాకిస్థాన్ పైలెట్లను మాత్రమే చూడదు. ఇది స్కార్దు నుంచి పస్నీ వరకూ విస్తరించి ఉన్న చైనా వైమానిక సామర్ధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోక తప్పదు.
అయితే చైనా ఇచ్చిన ఈ సపోర్టుతో సుమారు 250 మిలియన్లకు పైగా విలువైన ఒక రాఫెల్ ని గాల్లోనే కూల్చి వేసినట్టు సమాచారం. మరొకటి అతి త్వరగా తిరిగి వచ్చేసినట్టు తెలుస్తోంది. దీన్ని కాపాడ్డానికి ఉపయోగించే స్పెక్ట్రా EW వ్యవస్థ సైతం నిర్వీర్యమైంది. PL-15 రాడార్‌తో రాలేదు. ఇది AI- గైడెడ్ సైలెన్స్ ద్వారా వచ్చినట్టు సమాచారం.
చైనా వార్ ఫేర్ కేవలం స్కై, సర్ఫేస్ ద్వారా మాత్రమే సాగేది కాదు. దాని రేంజే వేరు. అది ఏకంగా స్పేస్ ద్వారా వార్ ని ఆపరేట్ చేయగలదు. ఆ స్థాయికి ఎప్పుడో తన యుద్ధ విన్యాసాన్ని సిద్ధం చేసి ఉంచింది డ్రాగన్ కంట్రీ. అందులో భాగంగా చైనా ఉపగ్రహాలు, AWACS సహాయంతో పాకిస్తాన్ వైమానిక దళం సెన్సార్- ఫ్యూజన్ కిల్‌ను అమలు చేసింది. రాఫెల్స్‌కు ఎప్పుడూ ఈ దిశగా సిగ్నల్స్ రాలేదు, వారి ప్రత్యర్థిని కూడా అవి చూడలేక పోయాయి. క్షిపణులు ఢీకొడుతున్న విషయం తెలిసే లోపలే కథ ముగిసిపోయింది.
భారత్ కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఒక రాఫెల్ ని పడగొట్టగలిగితే ఐదింటినీ కూడా పడగొట్టొచ్చు. అందుకే వారు సరిహద్దులకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారికి ధైర్యం లేక పోవడం వల్ల కాదు.. అక్కడున్న స్థితిగతుల మీదున్న అవగాహన వల్ల.
దీని ప్రభావం ఏమంత తక్కువైనది కాదు. ఇది భారతదేశ ప్రతిష్టాత్మక రాఫెల్, పాకిస్థాన్ జెట్ ప్రయోగించిన ఒక చైనా క్షిపణి దెబ్బకు పడిపోయిందంటే.. కేవలం యుద్ధ వ్యూహం మాత్రమే కాదిది.. ఒక భౌగోళిక రాజకీయ సందేశం కూడా.
బ్లూమ్‌బెర్గ్ వంటి కొందరు నిపుణులు చెప్పేదాన్ని బట్టిచూస్తే ఇది చైనా పాక్ సమగ్ర యుద్ధానికి ప్రత్యక్ష ప్రదర్శన. ఈ చైనా మార్క్ వార్ స్ట్రాటజీకి పెద్ద పెద్ద పాశ్చాత్య యుద్ధ విశ్లేషకులు కూడా ఆశ్చర్య పోయారు. ఫ్రెంచ్ రక్షణ ఒప్పందాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో చైనా చిరునగవులు చిందిస్తోంది. మేమంతా నిశ్శబ్ధంగానే చేస్తాం. మీలా సౌండ్ చేయం. అది మేమైనా మా పీఎల్ ఫిఫ్టీన్ తరహా క్షిపణులైనా.. అంతా సౌండ్ లెస్ అన్న మెసేజ్ పాస్ చేస్తోంది చైనా.
వార్ గేమ్ మొత్తం మారిపోయేలాంటి సీన్. ఇది 2019 కాదు.. బాలాకోట్ దాడి సమయం అంతకన్నా కాదు. యుద్ధ వ్యూహం ఎంతో ముదిరిపోయిన 2025లో ఉన్నాం. నాటి నుంచి నేటి వరకూ మారిన ప్రపంచ యుద్ధ నీతి అసాధారణమైనది. ఇప్పుడు మనం.. ఆయుధం కనిపిస్తుంది- కానీ శతృవు కనిపించని మాయా యుద్ధాన్ని చూస్తున్నాం. వచ్చే రోజుల్లో చైనా బేస్ చేసుకుని మలచబడుతోన్న వ్యూహంలో.. ఆయుధం, శతృవు రెండు కనిపించని మరింత మాయామేయ యుద్ధాన్ని చూడబోతున్నాం.. అది వేరే సంగతి.
చైనీకృతమైన పాక్ వైమానిక స్థలంలోకి ప్రవేశించే సాహసం చేస్తే.. J-10Cలు, PL-15లు వేసే డెడ్లీ స్కెచ్ లోకి కోరి వెళ్లడమే అవుతుంది. ఈ విషయం భారత్ కి బాగానే తెలుసు.
కాబట్టి భారత్ తప్పక వెనక్కి తగ్గి తీరాల్సిందే అన్న సిట్యువేషన్. మా ఆయుధం అక్కర్లేదు- భయం చాలు అన్నట్టుగా అటు వైపు ఆట మొదలై పోయింది. రాడార్ అంధత్వం, నిశ్శబ్ధ వ్యూహం ద్వారా భారత్ ని కట్టి పడేసింది చైనా అధీకృత పాక్ వార్ ఫీల్డ్.
ఇది భారత పైలెట్ల నైపుణ్య లేమికి సంబంధించిన పరాజయం కాదు. ఆ పైలెట్ యుద్ధ భూమిలో చూడలేని ఒక గాడాంధకారం కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇది ఉపగ్రహ నిర్మిత యుద్ధం. సెన్సార్ల ద్వారా అనుసంధానించబడిన యుద్ధం. అక్కడెక్కడో చైనాలో కూర్చుని ఆపరేట్ చేస్తే ఆ సిగ్నల్ చైనా శాటిలైట్లు అందుకుని.. ఇక్కడి యుద్ధ యంత్రాలకు పని చెబుతాయి. ఆ యంత్రాలు కంటికి కనిపించకుండా వచ్చి.. ఢీ కొట్టేస్తాయి. ఇదీ ఇక్కడ అమలు చేస్తోన్న అసలు సిసలైన యుద్ధ వ్యూహం.
2025 మేలో భారత్ పాక్ మధ్య జరుగుతోన్న ఈ యుద్ధంలో వార్ గేమ్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. 36 జెట్ ఫైటర్ల కొనుగోలు ద్వారా భారత్ నిర్మించుకున్న వైమానిక ఆధిపత్యపు కల ఒక్కసారిగా కాశ్మీర్ కొండల్లో దభేల్మని కూలిపోయిందని అంటుంది మెంఫిస్ బార్కర్ రాసిన కథన సారాంశం.
ఇది వ్యూహాత్మక యుద్ధం, న్యాయపోరాటానికి సంబంధించిన యుద్ధం కాదు. ఒక సైద్ధాంతిక సమరం. దానిక తాలూకూ పతనం. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ ఆధిపత్య పోరు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అమలుకు సంబంధించిన అంశం. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ ఆయుధ మేథావులంతా కలసి.. రియల్ టైమ్ లో అసలు విషయమేంటో పరిగ్రహిస్తున్నారు. పరిశీలిస్తున్నారు.
రాఫెల్ ఒక అన్ టచబుల్. దాని రేంజ్ నెక్స్ట్ లెవల్. దాని టెక్నాలజీ తిరుగులేనిది. దాని పైలెట్లు వరల్డ్స్ బెస్ట్. వారి రేంజే వేరు అనే బిరుదులు, విశేషణాలెన్నో. అలాంటి రాఫెల్ ప్రస్తుతం చైనా వేసిన ఉచ్చులో చిక్కింది. ఇక అది తప్పించుకోలేదు. దాని టైం బ్యాడ్ డే రోజున.. ఖచ్చితంగా ఫాల్ డౌన్ కావల్సిందే అన్న థియరీకి సంబధించిన వ్యవహారమిది.
అందరూ అనుకున్నట్టు చైనా ఏం చూస్తూ ఊరుకోవడం లేదు. ఈ యుద్ధంలోకి నిశ్శబ్ధంగానే అడుగు పెట్టింది. కొందరు పాశ్చాత్య విశ్లేషకులు తమకు అనువుగా మార్చి రాసుకున్న యుద్ధ వ్యూహాలు సిద్దాంతాలకిక్కడ తావు లేదు. ఇక్కడొక వార్ ఆల్రెడీ జరుగుతోంది. చైనా అపారమైన సైనిక శక్తికి దీటుగా ఇప్పటికే ఏఐ బేస్డ్ స్మార్ట్ వార్ గేమ్ తయారు చేయాలన్న కృతనిశ్చయంతో పాశ్చాత్య దేశాలుండగా.. వాటికి పాక్ వంటి యుద్ధ క్షేత్రం వేదికగా గట్టి బదులు ఇవ్వాలన్న ఆలోచనతో చైనా వార్ మైండ్ లో.. బ్లైండ్ గా ఫిక్సయినట్టు తెలుస్తోంది.
నిశ్శబ్దంగా గస్తీ తిరుగుతున్న సబ్ ఎరియల్ AWACS, నిష్క్రియాత్మక రీతిలో ఎగురుతున్న J-10C యుద్ధ విమానాలు, PL-15E క్షిపణులు 300 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని మాక్ 5 వేగంతో దేశీయ వేరియంట్లు లాక్ చేసి ఉంచారు. అందులో భాగంగా రాఫెల్ ఒకటి చిక్కి శల్యమైందని అంటున్నారు.
ఒక క్షిపణి తనకు 50 కిలోమీటర్ల దూరంలోకి వచ్చే వరకూ.. తానే దాని టార్గెట్ అని ఆ రాఫెల్ కి తెలియదు. ఆ వేగంతో పోటీ పడ్డానికి భారత పైలెట్ కి కేవలం 9 సెకన్లు మాత్రమే ఉన్నాయ్. స్పందించడానికది సరిపోలేదు. దీంతో రాఫెల్ నేలమట్టం కాక తప్పలేదని చెబుతోంది టెలిగ్రాఫ్ కథనం.
ఇకపై కాశ్మీర్ లోని భారత వైమానిక దళాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఫైటర్ జెట్ ఎగిరిన ప్రతిసారీ పాకిస్థాన్ రాడార్లు దాన్ని వెంటనే పసిగట్టేస్తాయి. పీఎల్ ఫిఫ్టీన్ ద్వారా దాన్ని సౌండ్ లెస్ గానే ఢీకొట్టేస్తుందని హెచ్చరిస్తోందీ కథనం.
ప్రస్తుతం ప్రపంచం ఈ యుద్ధ పతనాన్ని ఆయుధ విన్యాసాన్ని తన రెండు కళ్లతో చూస్తోంది. డస్సాల్ట్ ఏవియేషన్ షేర్ ధర స్థబ్ధుగా ఉండగా.. చైనా డిఫెన్స్ స్టాక్స్ అయిన AVIC, ALD చెంగ్డు ధరలు పెరుగుతున్నాయనీ తెలుస్తోంది.
ఎందుకంటే C4ISR ఆధిపత్యం – కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా ద్వారా ఇదంతా నిర్ణయించబడినట్టు అభిప్రాయ పడుతున్నారు నిపుణులు.
ఇప్పుడు భారత్ పాక్ కంటే ముందుకు వెళ్లలేదు. అది భారత్ ని ఎప్పుడో మించి పోయింది. భారత్ ఆశ్చర్యపోయేలోపల.. దాని వార్ బర్డ్స్ ని అదెప్పుడో నేల మట్టం చేసేసింది. భారత్ కి కలిగించే ఈ వార్ పెయిన్ పాక్ ఈ ప్రపంచానిక తెలియ చేస్తోన్న చైనా సైనిక సామర్ధ్య సందేశంగా భావించాల్సి ఉంటుందని చెబుతోంది టెలిగ్రాఫ్ కథనం.
ఈ వార్ కమ్ మైండ్ గేమ్ లో ఇప్పుడు భారత్ పాక్ కేవలం నిమిత్త మాత్రం. మిగిలినదంతా చైనా వర్సెస్ యూఎస్, యూకే వంటి పాశ్చాత్య దేశాల మధ్య జరిగే సంకుల సమరం. అందుకే ఈ విషయంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్టకూడదనుకున్నారు మోడీ. మన దగ్గరున్న ఫ్రెంచ్ రాఫెల్స్, రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి దీటుగా చైనా తన అస్త్రశస్త్ర విన్యాసమంతా ముందుకు తెచ్చింది. అది నేరుగా శతృవును ఢీ కొట్టడం లేదు. ఎక్కడో అంతరిక్ష కేంద్రంగా తన వార్ గేమ్ స్టార్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అన్నదొక భుజం మాత్రమే. భారత్ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. దాని గురి వేరు. దాని లక్ష్యం వేరని అంటోంది టెలిగ్రాఫ్ కథనం.
ఇపుడే స్పెక్ట్రా వ్యవస్థ కూడా దాన్ని గుర్తించలేదు. ఉపగ్రహం ద్వారా ఆపరేట్ అయ్యే ఆ క్షిపణిని ఏ EW సూట్ కూడా మోసగించలేదు. ఏ ఫైటర్ జెట్ కూడా రాబోయే మరణ సమయాన్ని కనీసం ఊహించలేదు. ఆకాశమిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది వైమానిక వైమానిక యుద్ధ ముగింపు కాదు. నిశ్శబ్ధ, అదృశ్య, జవాబు చెప్పనలవి కాని వైమానిక ఆధిపత్యానికి సంబంధించిన ఘన ప్రారంభంగా అభివర్ణిస్తున్నారు అంతర్జాతీయ యుద్ధ వ్యవహారాల నిపుణులు.
ఇది టెలిగ్రాఫ్ కథన సారాంశం కాగా. దీనిపై ప్రతిస్పందనలు సైతం తీవ్రంగానే వస్తున్నాయి. ఇదొక ఊహాజనిత కల్పిత గాథ అని అభివర్ణిస్తున్నారు కొందరు యుద్ధ నిపుణులు. ఇది కేవలం రాఫెల్ పై బురదజల్లే క్రమమని. ఈ ఉచ్చులో చిక్కరాదన్ని వీరి వాదన. అయితే పీఎల్ 15 క్షిపణులను చైనా పాక్ కి ఇచ్చిన మాట నిజమే అయినా రాఫెల్ విమానాలు కూల్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవన్న మాట వినిపిస్తోంది.