సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోను, తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela). గత మార్చి నెలలో నితిన్ తో కలిసి ‘రాబిన్ హుడ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో’ఉస్తాద్ భగత్ సింగ్’, మాస్ జాతర’, ‘లెనిన్’ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
రీసెంట్ గా శ్రీలీల ఇనిస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన పిక్స్ లో కొంత మంది ఆడవాళ్ళు శ్రీలీల చెంపలకి పసుపు పూస్తున్నారు. ఆ పిక్స్ కి ‘బిగ్ డే, కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ ని ఉంచింది. సాధారణంగా పెళ్లి సందర్భంలోనో, లేదా ఎంగేజ్మెంట్ సందర్భంలోనో ఆడవాళ్ళకి ఆ విధంగా పసుపు పూస్తారు. దీంతో శ్రీలీలకి ఎంగేజ్మెంట్ అయ్యిందేమో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
లు చేస్తున్నారు. వ్యాపార ప్రకటనకి సంబంధించిన యాడ్ అయ్యి కూడా ఉండవచ్చనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
కాకపోతే ఇక్కడ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీలీలకి పసుపు పూస్తుంది ఎవరో కాదు వాళ్ళ అమ్మే. దీంతో ఎంగేజ్మెంట్ అయ్యి ఉండవచ్చనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే గాని అసలు విషయం తెలియదు. నిజానికి శ్రీలీల పెళ్లి వార్తలపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్,శ్రీలీల ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ తల్లి ఒక సందర్భంలో మాట్లాడుతు డాక్టర్ చదివే అమ్మాయి కోడలుగా రావాలని చెప్పింది. దీంతో కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan), శ్రీలీల ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. ఎందుకంటే శ్రీలీల డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఎమ్ బిబిఎస్ కూడా చదువుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం ఆషీకీ పార్ట్ 3 చేస్తుంది. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరో.