posted on Jun 16, 2025 10:06AM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆదివారం (జూన్ 15 రాత్రి ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తతుం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
సోనియా గాంధీ చాలా కాలంగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే ఆమె సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సాధారణ పరీక్షలు చేయించుకున్నారు. కాగా ఇప్పుడు సోనియాగాంధీ కొన్ని రోపజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. సోనియా ఆస్పత్రిలో చేరారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.