IPL 2025 MI Pacer Bumrah Comeback: బ్యాటర్లూ జాగ్రత్త.. పేస్ లయన్ ఈజ్ బ్యాక్.. నేడు ఆర్సీబీ మ్యాచ్ లో గ్రౌండ్ లోకి!
IPL 2025 MI Pacer Bumrah Comeback: ఐపీఎల్ 2025లో ఓటములతో సతమతమవుతున్న ముంబయి ఇండియన్స్ ను ఆదుకునేందుకు పేస్ వీరుడు వచ్చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కు ఆడే ఛాన్స్ ఉంది.
బ్యాటర్లూ జాగ్రత్త.. వికెట్లను కాపాడుకునేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఐపీఎల్ 2025కు యార్కర్ కింగ్, పేస్ లయన్ తిరిగొచ్చాడు. డేంజరస్ బౌలింగ్ తో బ్యాటర్లను వణికించేందుకు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా రెడీ అయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 7) ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ ముంబయి ఇండియన్స్ కు ఆడే ఛాన్స్ ఉంది. ఇది ముంబయి ఫ్యాన్స్ కు గ్రేట్ గుడ్ న్యూస్. ఫెయిల్యూర్ తో సాగుతున్న టీమ్ ను బుమ్రా ఆదుకుంటాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
నెట్స్ లో జోరుగా
ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఎందుకంటే జట్టుతో చేరిన బుమ్రా జోరుమీద కనిపించడమే అందుకు కారణం. నెట్స్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసిన బుమ్రా.. ఇతర బౌలర్ల స్టైల్ ను కాపీ చేస్తూ కూడా బంతులేశాడు. స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ ను కాపీ చేస్తూ లెఫ్మార్మ్ బౌలింగ్ చేశాడు బుమ్రా. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే హోం మ్యాచ్‌కు వెళ్లే ముందు, నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓటములను ఎదుర్కొన్న ఐదు సార్లు ఛాంపియన్ ముంబయికి ఇది పెద్ద రిలీఫ్.
వెల్ కమ్ ముఫాసా
ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకి బుమ్రా ఎంతో ఇంపార్టెంట్ ప్లేయర్. అందుకే బుమ్రా రాగానే అతణ్ని భుజాలపై ఎత్తుకున్న ఆ టీమ్ మాజీ ప్లేయర్, బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ ‘‘వెల్ కమ్ ముఫాసా” అని అన్నాడు. వార్మప్ డ్రిల్‌తో ప్రాక్టీస్ ప్రారంభించిన బుమ్రా.. ఆ తర్వాత క్రీజ్‌కు వెళ్లి వేగవంతమైన బంతులను విసిరేశాడు.నెట్స్‌లో బుమ్రా యాక్టివ్ గా కనిపించాడు.
రోహిత్ శర్మను షార్ప్, ఇన్‌కమింగ్ డెలివరీలు, ఆఫ్ స్టంప్ వెలుపల పర్ఫెక్ట్ లెంత్ బాల్స్ తో ఇబ్బంది పెట్టాడు. ఈ ఏడాది జవవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన లాస్ట్ టెస్టులో వెన్ను నొప్పితో బుమ్రా మధ్యలోనే గ్రౌండ్ వీడిన సంగతి తెలిసిందే. అంతకుముందు బుమ్రా తిరిగిరావడాన్ని అతని భార్య సంజన.. తమ కొడుకు అంగద్ కు స్టోరీలా చెప్పింది. లయన్ తిరిగి వచ్చాడని పేర్కొంది. ఈ వీడియోను ముంబయి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
బుమ్రా రెడీ
“బుమ్రా అందుబాటులో ఉన్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. ఆర్‌సీబీ మ్యాచ్‌కు రెడీగా ఉంటాడు. బాగానే బౌలింగ్ చేేస్తున్నాడు. అంతా బాగుంది’’ అని ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపాడు. బుమ్రా రాకతో ముంబయి పేస్ దాడి మరింత పదునెక్కనుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తో కలిసిన బుమ్రా పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే. 2013 నుండి ఐపీఎల్ లో ఎంఐ తరపున ఆడుతున్న బుమ్రా 133 మ్యాచ్‌లలో 165 వికెట్లు తీశాడు.
సంబంధిత కథనం