IPL SRH Owner Kavya Maran Angry: కావ్య పాపకు కోపమొచ్చింది.. ఇలాగేనా బ్యాటింగ్ చేసేది? ఎక్స్‌ప్రెషన్ వీడియో వైరల్
IPL SRH Owner Kavya Maran Angry: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు కోపమొచ్చింది. ఐపీఎల్ లో టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ కావ్య స్టాండ్స్ లో సందడి చేస్తుందనే సంగతి తెలిసిందే. కానీ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో అభిషేక్ ఔట్ కాగానే కావ్య మారన్ అసంతృప్తితో ఊగిపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం (ఏప్రిల్ 6) ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 153 లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్ లైన్‌అప్ వరుసగా నాలుగోసారి సరిగ్గా ఆడలేకపోయింది. దీంతో ఓనర్ కావ్య మారన్ కు కోపమొచ్చింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ అవుట్ అయినప్పుడు ఆమె అసంతృప్తి అందరికీ కనిపించింది.
యాంగ్రీ పాప
గతేడాది ఐపీఎల్ లో బ్యాటింగ్ ఊచకోతకు దిగిన సన్‌రైజర్స్.. ఈ సారి పూర్తిగా ఫెయిల్ అవుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ 200 చేయలేకపోయింది. ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో టీమ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఐదో ఓవర్ నాలుగో బంతికి సిరాజ్ గుడ్ లెంత్ డెలివరీ వేశాడు. అభిషేక్ మిడాన్ వైపు ఆడాడు. కానీ టైమింగ్ కుదరకపోవడంతో ఈజీ క్యాచ్ ఇచ్చాడు. అభిషేక్16 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే, కెమెరాలు కావ్య మారన్ వైపు మళ్ళాయి. ఆమె ముఖంలో కోపం కనిపించింది. క్యూట్ కావ్య కాస్త యాంగ్రీ కావ్యగా మారింది. అభిషేక్ అలాంటి పేలవ షాట్ అవుట్ కావడం కావ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమె చేతులతో సంజ్ఞలు చేస్తూ తన అసంతృప్తిని వెళ్లగక్కింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) April 6, 2025
Kavya Maran angry expression after Travis and Abhishek gets out
Mat khelo 300 ke liye 😂#SRHvsGT #siraj #GTvSRH #kavyamaran #IPL2025 pic.twitter.com/JddNFP11ms— CrickStudd (@CrickStudd) April 6, 2025
గుజరాత్ టైటాన్స్ విక్టరీ
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 19లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని సాధించింది. శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రూథర్‌ఫోర్డ్ బ్యాటింగ్ లో చెలరేగడంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 153 లక్ష్యాన్ని జీటీ సులువుగా ఛేజ్ చేసింది.
ఫస్ట్ బ్యాటింగ్ లో మళ్లీ ఫెయిల్ అయిన సన్‌రైజర్స్ 152 రన్స్ మాత్రమే చేసింది. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. గుజరాత్ పేసర్ సిరాజ్ 4 వికెట్లతో ఆ టీమ్ ను దెబ్బకొట్టాడు.
సంబంధిత కథనం