గడప కూడా తొక్కనివ్వను…
కార్తీక్ మాటలతో హర్ట్ అయిన జ్యోత్స్న బయలుదేరబోతుంది. ఆమెను కార్తీక్ ఆపుతాడు. ఈ రోజు రెస్టారెంట్‌లో కలెక్షన్ అదిరిపోయిందని, ఈ ఆనందాన్ని మాతో పంచుకుంటే బాగుంటుందని ఆమెకు స్వీట్ ఇస్తాడు. చూశావా బావా నీకు నాపై ఇంకా ప్రేమ ఉందని జ్యోత్స్న అంటుంది. ఈ మాట నిజమే…నువ్వు మా అత్త కూతురివి…ఆ ఇంటి రక్తం నీలో లేకపోయింటే ఇంటి గడప తొక్కనిచ్చేవాడిని కాదని అంటాడు. సుమిత్ర కూతురు కాదని తెలిస్తే తనను బావ దగ్గరకు కూడా రానివ్వడని తెలిసి జ్యోత్స్న కంగారు పడుతుంది. నువ్వు తింటున్న స్వీట్ దీపనే చేసిందని, కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ చేస్తామని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.