Mark Shankar Pawan: అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు, సింగపూర్ బయల్దేరిన పవన్ కళ్యాణ్
Mark Shankar Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. సింగపూర్‌లో చదువుకుంటున్న మార్క్ శంకర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నట్టు జనసేన మీడియా వర్గాలు వెల్లడించాయి. అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సింగపూర్ బయల్దేరనున్నారు.
Mark Shankar Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో ప్రమాదానికి గురయ్యారు. మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయపడినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియడంతో మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం అవుతారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కు సమాచారం అందడంతో పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు సోమవారం మాట ఇచ్చానని… ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకోనున్నట్టు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని జనసేనయ వర్గాలు తెలిపాయి.
అల్లూరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నట్టు జనసేన ప్రతినిధులు తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారని అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ 2017 అక్టోబర్ 10వ తేదీన జన్మించారు. ఎనిమిదేళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు.
సంబంధిత కథనం